Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత... కత్తులు, కర్రలతో వైసిపి, టిడిపి శ్రేణుల వీరంగం (వీడియో)

అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి శ్రేణులు నడిరోడ్డుపై కత్తులు, కర్రలతో పరస్పర దాడులకు తెగబడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

fight between ysrcp, tdp activists in guntur district
Author
Guntur, First Published Sep 17, 2021, 11:52 AM IST

గుంటూరు: అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి శ్రేణులు బాహాబాహీకి దిగడంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ముప్పాళ్ళ మండలం తొండపిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణచోటుచేసుకుని ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. కత్తులు, కర్రలతో పరస్పర దాడులకు దిగడంతో పలువురికి తీవ్ర గాయాలన్నారు. ఇలా గాయపడిన వారిలో మహిళలు కూడా వున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరక్కుండా తొండపిలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

వీడియో

గురువారం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా టిడిపి ఏర్పాటుచేసిన సభకు వెళ్లామనే కోపంతోనే వైసిపి వాళ్లు తమపై ఇలా దాడికి పాల్పడినట్లు టిడిపి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. తమ ఇళ్లమీదకు కత్తులు, కర్రలతో వచ్చి ఆడా మగా అని చూడకుండా దాడిచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిలో గాయపడిని ఆరుగురూ టిడిపి వర్గీయులేనని... వారంతా సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితులు తెలిపారు.

 
 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios