కృష్ణాజిల్లా జన్మభూమి కార్యక్రమాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గురువారం ఉయ్యూరులో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదాం చోటు చేసుకోవడంతో కార్యక్రమం రసాభాసాగా మారింది. తాజాగా ఇవాళ కూడా అలాంటి వాతావరణం కొనసాగింది.

ఇవాళ పెదఓగిరాలలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, వైసీపీ నేత పార్థసారథి మధ్య గృహ నిర్మాణం, ఇళ్ల కేటాయింపులపై వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే మైలవరంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమాను అడ్డుకునేందుకు కృష్ణప్రసాద్‌ ప్రయత్నించడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నందిగామలోనూ ఎంపీ కేశినేని నానిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.