గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దాచేపల్లిలోని ముగ్గురాయి క్వారీ వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు నలుగురిని కత్తితో పొడిచారు.

ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన వారిని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.