నంద్యాల నియోజకవర్గంలో ఆధిపత్య పోరు మొదలైంది. నంద్యాల ఫలితం వచ్చిన వారం రోజుల్లోపే ఆధిపత్య పోరు మొదలవ్వటం గమనార్హం. ఇద్దరు మంత్రుల మధ్య ప్రారంభమైన పోరు చంద్రబాబునాయుడుకు తలనొప్పిగా తయారైంది. నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ పోస్టు కోసం పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎవరికి వారే పట్టుబడుతున్నారు.

నంద్యాల నియోజకవర్గంలో ఆధిపత్య పోరు మొదలైంది. నంద్యాల ఫలితం వచ్చిన వారం రోజుల్లోపే ఆధిపత్య పోరు మొదలవ్వటం గమనార్హం. ఇద్దరు మంత్రుల మధ్య ప్రారంభమైన పోరు చంద్రబాబునాయుడుకు తలనొప్పిగా తయారైంది. నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ పోస్టు కోసం పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎవరికి వారే పట్టుబడుతున్నారు. నంద్యాల ఉపఎన్నికలో టిడిపి గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. గెలుపు కోసం మంత్రులు ఎవరికి కావాల్సిన వారికి తమ ఇష్టమైన హామీలను ఇచ్చారు. ఆ హామీలే ఇపుడు మంత్రుల మధ్య ఫైటింగ్ కు దారితీస్తోంది.

మొన్నటి ఉపఎన్నికలో టిడిపికి పనిచేయటానికి ఒప్పించటంలో భాగంగానే కొందరు ముఖ్యులకు ఆదినారాయణరెడ్డి గోస్పాడు మండలంలో హామీలిచ్చారు. మొత్తానికి ఆది ఇచ్చిన హామీలతో పార్టీకి మండలంలో మెజారిటీ వచ్చింది. మంత్రి ఎవరెవరకి ఏమేమి హామీలిచ్చిందీ స్పష్టంగా తెలియకపోయినా మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవిని కానాల గురునాధరెడ్డి, సాయినాధరెడ్డిలలో ఒకరికి ఇప్పిస్తానని హమీ ఇచ్చారట.

అదేసమయంలో భూమా అఖిలప్రియ కుడా అదే పోస్టును శీలం భాస్కర్ రెడ్డి, మునగాల లక్ష్మీకాంత రెడ్డిలో ఒకరికి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఫలితం రాగానే వీరిద్దరిలో ఒకరికి ఛైర్మన్ పోస్టు ఇవ్వాల్సిందిగా సిఫారసు కుడా చేసారు. ఆ విషయం తెలియటంతోనే మంత్రి ఆది అడ్డుపడుతున్నారు. తాను చెప్పిన వారికే ఛైర్మన్ పోస్టు ఇవ్వాలంటూ ఆది పట్టుపడుతున్నారు. దాంతో అఖిల మార్కెటింగ్ శాఖ మంత్రిపై మండిపోతున్నారు. తమ నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు.

అయితే, అదే సమయంలో ఆది కుడా వెనక్కు తగ్గటం లేదు. ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీల మేరకే, తమ కృషి ఫలితంగానే భూమా కుటుంబం ఎన్నికల్లో గెలిచిందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారట. సిఎం ఆదేశాల మేరకు తాము కొందరికి కొన్ని హామీలిచ్చామని ఇపుడు వాటిని నిలుపుకొనకపోతే రేపు తమకు ఇబ్బందులు తప్పవని ఆదినారాయణరెడ్డి అంటున్నారు. సరే, వీరిద్దరి గొడవలు ఈ విధంగా ఉండగానే, ఎంఎల్సీ ఫరూఖ్ కుడా తన మద్దతుదారులకే ఛైర్మన్ పోస్టు ఇవ్వాలంటూ రెండు పేర్లు సిఫారసు చేసారట. మరి ఒకపోస్టు కోసం ఇంతమంది పట్టుపడుతున్నపుడు చంద్రబాబు ఎవరివైపు మొగ్గుతారో అర్ధం కావటం లేదు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి