ఐదో రోజూ ఏపీలో మత్స్యకారుల కోసం గాలింపు: సముద్రంలో నలుగురి కోసం అన్వేషణ

అంబేద్కర్  కోనసీమ జిల్లా అంతర్వేదికి చెందిన నలుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది. ఐదో రోజున మచిలీపట్టణం నుండి మరో రెండు బోట్ల ద్వారా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారుల కోసం హెలికాప్టర్ల ద్వారా కూడా గాలిస్తున్నారు. 

 Fifth Day Search operations continue for the missing fishermen in Machilipatnam

విజయవాడ: అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదికి చెందిన నలుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఐదు రోజులుగా మత్స్యకారుల కోసం అధికారులు గాలిస్తున్నారు. మచిలీపట్టణం నుండి అంతర్వేది వరకు అన్ని వైపులా గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాపటర్, డార్నియర్ ఫ్లైట్, ఎనిమిది బోట్లతో నలుగురు మత్స్యకారుల కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టారు. 

విశాఖపట్టణం నుండి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ మచిలీపట్ణణం నుండి రెండు బోట్లలో స్థానిక పోలీస్, మెరైన్ సిబ్బంది గాలింపును ప్రారంభించారు. నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా కూడా మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఐదో రోజైన ఇవాళ కూడా గాలింపు కార్యక్రమాలను  ప్రారంభించారు.

చెక్క నరసింహరావు, మోకా వెంకటేశ్వరరావు, విశ్వనాథపల్లి చినమస్తాన్ , రామాని నాంచార్లు సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా వెళ్లారు. ఈ నలుగురు వెళ్లిన బోటు ఇంజన్ పాడైనట్టుగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వీరి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో చార్జీంగ్ కూడా అయిపోవడంతో వారు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని గుర్తించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఈ మొబైల్ ఫోన్లకు మేసేజ్ ను పంపితే గంటల ఆలస్యంగా  మేసేజ్ వెళ్లింది.ఈ మేసేజ్ వెళ్లిన లోకేషన్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వీరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో  ఇవాళ కూడా గాలింపును మరింత ముమ్మరం చేశారు. 

మత్స్యకారులు చివరిసారిగా తమ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన సమయంలో బోటు ఇంజన్ పాడైందని సమాచారం ఇచ్చారు.  అంతేకాదు తమ ఫోన్లలో కూడా చార్జింగ్ కూడా అయిపోయిందని చెప్పారు. ఈ ఫోన్ మాట్లాడిన తర్వాతి నుండి మత్స్యకారుల నుండి సమాచారం రాలేదు. ఫోన్లు పనిచేయడం లేదు. ఫోన్లు చార్జింగ్ అయిపోవడంతో పనిచేయడం లేదని  అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. ఈ నలుగురు మత్స్యకారులు ఎక్కడున్నారనే విషయమై అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

also read:ఏపీలో నలుగురు మత్య్సకారుల ఆచూకీ గల్లంతు: కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఐదు రోజులుగా మత్స్యకారుల ఆచూకీ  తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. మత్స్యకారుల కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పేర్ని నాని కలిసి వారికి ధైర్యం చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్స్ మరింత వేగం చేస్తామని కూడా చెప్పారు. ఈ నెల 6న పేర్నినాని గల్లంతైన వారి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదిలా ఉంటే ఐదో రోజున డ్రోన్ల సహాయంతో కూడా అధికారులు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో ఎక్కడైనా మత్స్యకారులున్నారా అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios