Asianet News TeluguAsianet News Telugu

మహిళా కూలీని వరించిన వజ్రం.. పొలం పనులకు వెడితే చేతికి చిక్కి...

కూలీ పనులకు వెళ్లిన మహిళకు అదృష్టం వరించింది. పొలం పనుల కోసం వెడితే వజ్రం దొరికింది. ఈ ఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామంలో జరిగింది. ఇప్పుడు ఈ వార్త స్తానికంగా చర్చనీయాంశంగా మారింది.

female laborer found diamond at farm in kurnool - bsb
Author
Hyderabad, First Published Jun 28, 2021, 9:46 AM IST

కూలీ పనులకు వెళ్లిన మహిళకు అదృష్టం వరించింది. పొలం పనుల కోసం వెడితే వజ్రం దొరికింది. ఈ ఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామంలో జరిగింది. ఇప్పుడు ఈ వార్త స్తానికంగా చర్చనీయాంశంగా మారింది.

జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం పొలంలో కూలీ పనులకు వెళ్లింది. అక్కడ పనులు చేస్తుండగా.. ఆమెకు వజ్రం దొరికింది. ఇది నాలుగున్నర క్యారెట్లు ఉన్నట్లుగా సమాచారం. ఈ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ. 6.50 లక్షలు, 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఏటా తొలకరి వర్షాలకు వజ్రాలు దొరకడం మామూలే. 

కాగా, గత నెలలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో అత్యంత విలువైన వజ్రాలు దొరుకుతున్నాయి. జొన్నగిరి, పగిడిరాయి, జీ ఎర్రగుడి, పెరవలి ప్రాంతంలో ఇవి లభ్యమవుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిన్న జొన్నగిరిలో ఒక రైతుకు విలువైన వజ్రం దొరికింది. పొలంలో పనులు చేస్తున్న ఆ రైతుకు వజ్రం దొరగ్గా.. రహస్యంగా టెండర్ వేశారు. దానిని రూ.కోటి 25 లక్షలకు కొనుగోలు చేశారు గుత్తికి చెందిన వ్యాపారులు. అది బహిరంగ మార్కెట్‌లో రూ. 3కోట్లకు పైగా విలువ చేస్తుందని వ్యాపారులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios