తాగిన మత్తులో కూతురిపై మూడేళ్లుగా తండ్రి అత్యాచారం

First Published 21, May 2018, 8:31 AM IST
Father sexually assualts girl in Chittor district
Highlights

మద్యం మత్తులో వావివరుసలు మరిచి వ్యవహరించిన వ్యక్తి ఉదంతం వెలుగులోకి వచ్చింది. 

చిత్తూరు: మద్యం మత్తులో వావివరుసలు మరిచి వ్యవహరించిన వ్యక్తి ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాగుడుకు బానిసైన అతను గత మూడేళ్లుగా కూతురిపై అఘాయిత్యం చేస్తూ వస్తున్నాడు. చిత్తూరు జిల్ాల చంద్రగిరి మండలంలోని ఓ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన జీపు డ్రైవరుకు భార్య, కూతురు(22), కుమారుడు ఉన్నారు. కూతురిపై అతను కన్నేసి అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. లైంగిక వాంఛ తీర్చకుంటే ఇనుప కమ్మీలతో చితకబాదాడని బాధితురాలు అంటోంది. విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడని ఏడుస్తోంది. 

తల్లి కూడా ఏమీ చేయలేకపోయింది. సంఘటనపై వెంటనే స్పందించిన సీఐ సురేంద్రనాయుడు, ఎస్సై చిరంజీవి బాధిత యువతి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

loader