వీడసలు తండ్రేనా: కూతురిపై అత్యాచారం

Father rapes daughter in absence of his wife
Highlights

కామంతో కళ్లు మూసుకుపోయి ఓ వ్యక్తి తన కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఒంగోలు: కామంతో కళ్లు మూసుకుపోయి ఓ వ్యక్తి తన కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో గురువారం వెలుగు చూసింది. పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు గిరిజన గూడేనికి చెందిన పదేళ్ల బాలిక ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి చదవింది. 

వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చి సొంతగూడెం అయిన తుమ్మలబైలులో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.  బుధవారం సాయంత్రం బాలిక తల్లి మేకలు కాసేందుకు అడవిలోకి వెళ్లింది. ఆ సమయంలో తండ్రి దాసరి గురవయ్య బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

దాన్ని చూసిన బాలిక తమ్ముడుఇంటికి రాగానే తల్లికి జరిగిన  ఘటనను వివరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన తల్లి తన భర్తపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.

కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారని అంటున్నారు. అయితే, గురవయ్య పోలీసుల అదుపులోనే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. 

loader