కోడి కోసం జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది.  కన్న కొడుకుని ఓ తండ్రి అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొద్దిడిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడిలో అడ్డాకుల మద్దేశ్వరరావు(22) అనే వ్యక్తి తన పెరట్లో కోడిని పెంచుకుంటున్నాడు.

Also Read వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి ప్రమాదం..ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు...

అతని తండ్రి కాంతారావు ఆ కోడిని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు తీసుకువెళ్లి నీటిలో ముంచేశాడు. దీంతో ఆ కోడి చనిపోయింది. ఇంటికి వచ్చిన కుమారుడు కోడి గురించి ఆరా తీయగా... కోడి చనిపోయినట్లు  చెప్పారు.

తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కోడి చనిపోయిందని చెప్పడంతో తట్టుకోలేక తండ్రితో గొడవ పడ్డాడు. ఈ విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి గురైన తండ్రి కాంతారావు.. కొడుకు మద్దేశ్వరరావుని కత్తితో ఛాతిపై పొడిచాడు. దీంతో మద్దేశ్వరరావు అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.