కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కన్నబిడ్డలను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. జూపాడు బంగ్లాకు చెందిన ధనోజిరావుకు భార్యపై అనుమానంతో ఆమెను తరచూ వేధిస్తూ ఉండేవాడు. 

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కన్నబిడ్డలను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. జూపాడు బంగ్లాకు చెందిన ధనోజిరావుకు భార్యపై అనుమానంతో ఆమెను తరచూ వేధిస్తూ ఉండేవాడు.

వీరికి కొడుకు మధు, కూతురు లిఖిత ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం పిల్లలు నిద్రపోతుండగా.. కొడుకును సమీపంలోని నీటి తొట్టెలో వేసి హతమార్చాడు. అనంతరం కూతురు గొంతు కోసి హత్య చేశాడు. ప్రస్తుతం పోలీసులు అదుపులో నిందితుడు ఉన్నాడు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.