Asianet News TeluguAsianet News Telugu

‘నువ్వు లొంగకపోతే నీ రెండేళ్ల పాపతో కోరిక తీర్చుకుంటా’.. కీచకమామ దుర్మార్గం..భర్త వత్తాసు.. !!

గుంటూరు డొంక రోడ్డుకు చెందిన సందీప్ ఎలినేని సందీప్ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ తరువాత 2016లో శ్రీనగర్ కు చెందిన స్వాతి తో వివాహం అయ్యింది. అయితే, సందీప్ టిక్ టాక్ ద్వారా పరిచయమైన అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకునేవాడు. వారితో జల్సాగా తిరిగేవాడు.

father-in-law obscene behavior with daughter-in-law with the help of son in guntur
Author
Hyderabad, First Published Aug 3, 2021, 10:07 AM IST

గుంటూరు : కుటుంబాల్లో ఎన్నో దారుణాలు జరుగుతుంటాయి. బాధితులు స్వయంగా బైటికి వచ్చి చెప్పనంత వరకు ఆ అమానుషాలు వెలుగులోకి రావు.. యేళ్లు గడుస్తున్నా అలాగే కొనసాగుతూనే ఉంటాయి. అలాంటి ఓ దారుణ ఘటన గుంటూరులో తాజాగా వెలుగుచూసింది..

గుంటూరు అర్బన్ ఎస్పీ సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళ తనకు జరిగిన అన్యాయాన్నివెల్లబోసుకుంది. అంతేకాదు భర్త, కీచక మామల నుంచి తన చిన్నారి కుమార్తెకు రక్షణ కల్పించాలని ఆ మహిళ పోలీసులను వేడుకుంది.  

వారు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు డొంక రోడ్డుకు చెందిన సందీప్ ఎలినేని సందీప్ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ తరువాత 2016లో శ్రీనగర్ కు చెందిన స్వాతి తో వివాహం అయ్యింది. అయితే, సందీప్ టిక్ టాక్ ద్వారా పరిచయమైన అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకునేవాడు. వారితో జల్సాగా తిరిగేవాడు.

ఆ సమయంలోనే స్నేహితురాలు అంటూ ఓ మహిళను తరచూ ఇంటికి తీసుకు వచ్చేవాడు. ఎంటని అడిగితే.. సందీప్ తల్లి పద్మావతి కూడా అతనికే వత్తాసు పలికేది. పద్మావతి ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేసేది. 2017 సంవత్సరంలో పద్మావతి అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె ఉద్యోగం కోసం కొడుకు సందీప్ ప్రయత్నిస్తున్నాడు. 

ఈ క్రమంలో కంభంపాడులో నివసించే సందీప్ తండ్రి శ్రీనివాసరావు తరచూ కొడుకు ఇంటికి వచ్చి కోడలితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. భర్త తో చెబితే తండ్రిని వెనకేసుకొచ్చాడు. పద్మావతి ఉద్యోగం కుమారుడికి రావాలంటే శ్రీనివాసరావు ఎన్ఓసీ మీద సంతకం చేయాలి. ఈ కారణంగా తన తండ్రికి సహకరించాలి అంటూ సందీప్.. స్వాతిని ప్రోత్సహించేవాడు. అంతేకాదు మామ శ్రీనివాసరావు బాత్రూంలో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడు.

వంగి నమస్కారం:అధికారుల తీరుపై జేసీ నిరసన, కార్యాలయంలోనే బస

కుమారుడిని ఇతర మహిళలతో తిరగకుండా బుద్ధి చెప్పాలని, తనకు న్యాయం చేయాలని స్వాతి మామను కోరింది. అతను తన వక్రబుద్ది బైటపెట్టాడు... ‘నాతో ఉండు నీకు న్యాయం చేస్తా’నంటూ దుర్మార్గంగా వ్యవహరించాడు. అనంతరకాలంలో స్వాతికి, ఆమె రెండేళ్ల కుమార్తె సరిగా తిండి పెట్టలేదు. 

ఎంతకీ స్వాతి లొంగకపోవడంతో.. మామ లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె ఎదురు తిరిగి ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తింది.  ‘నువ్వు లొంగకపోతే నీ రెండు సంవత్సరాల పాపతో కోరిక తీర్చుకుంటా’నని పాపను లాక్కుని బెదిరించాడు. శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు.

ఆ తరువాత 2018 డిసెంబర్ లో బంధువుల సహాయంతో స్వాతి శ్రీనగర్లోని పుట్టింటికి చేరింది. ఒక రోజు భర్త అక్కడికి వెళ్లి..  ఇంటి ముందు ఉన్నాను బయటకు రమ్మని పిలిచాడు. స్వాతి బైటికి వెళ్ళింది. అప్పటికే అక్కడున్న  కొందరు వ్యక్తులు ఆమెపై రాళ్ళు విసిరారు. మామ, భర్తల మీద ఫిర్యాదు చేసేందుకు వెడుతున్నానని తెలిసి.. చంపుతామని బెదిరించారు. నాకు, నా కుమార్తెకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలని స్వాతి కోరింది.. అని పోలీసులు తెలిపారు.  

Follow Us:
Download App:
  • android
  • ios