ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిలువునా ముంచారు తండ్రీకొడుకులు. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం కాకర్లలో నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న హెడ్‌మాస్టర్ కన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

కొడుకు కృష్ణకాంత్‌తో కలిసి ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నాడు. దోనకొండ మండలం మంగినపూడి ప్రాథమిక పాఠశాలలో కన్నయ్య హెచ్ఎంగా పనిచేస్తున్నాడు. ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేశారు తండ్రీకొడుకులు.

బాధితుల ఫిర్యాదుతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఫేక్ సర్టిఫికేట్లు, నకిలీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.