మహబూబ్‌నగర్ దిండి వాగులో ఇద్దరు రైతులు చిక్కుకున్నారు. వీరిని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన దంపతులుగా గుర్తించారు. ఈ క్రమంలో వారిని రక్షించేందుకు హెలికాఫ్టర్ పంపాలని సీఎం కేసీఆర్‌ను కోరారు ఎమ్మెల్యే బాలరాజు.

అంతకు ముందు వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తాయి. పొలం పనుల కోసం వెళ్లిన ఓ కుటుంబం వాగులో గల్లంతయ్యాయి.

షాపూర్ తండాకు చెందిన దశరథ్ కుటుంబం ఉదయం పోలానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఎనిమిది మంది కుటుంబసభ్యులు కొట్టుకుపోయారు.

దశరథ్ నాయక్ ప్రాణాలకు తెగించి ఏడుగురు పిల్లలను కాపాడారు. కానీ భార్య అనితా బాయిని రక్షించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు.