గుంటూరు: ఏపీకి  మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటననను నిరసిస్తూ గుంటూరు జిల్లా మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మూడు రాజధానుల ఆలోచనను విరమించుకోవాలని  రైతులు డిమాండ్ చేశారు.

Also read:తిండి లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకొచ్చి: మూడు రాజధానులపై పవన్ స్పందన

మంగళవారం నాడు  సాయంత్రం ఏపీ అసెంబ్లీలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందనే సంకేతాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనను గుంటూరు  జిల్లా మందడానికి చెందిన రైతులు  తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Also Read:జగన్ నిర్ణయంతో జనానికి ముప్పు తిప్పలే: మూడు రాజధానులపై బాబు వ్యాఖ్యలు

అభివృద్ది  చెందిన దేశాల్లో, రాష్ట్రాల్లో కూడ ఒకే రాజధాని ఉన్న విషయాన్ని రైతులు చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలుగా విభజించి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

అమరావతి నుండి రాజధానిని మారిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని రైతులు చెప్పారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్న విషయాన్ని రైతులు తప్పుబడుతున్నారు.

Also Read:ఏపీకి మూడు రాజధానులు వచ్చే ఛాన్స్: అసెంబ్లీలో జగన్

దక్షిణాప్రికా ఏ పాటి అభివృద్ది చెందిందో అందరికీ తెలుసునని చెప్పారు. రైతుల ఆందోళనకు  టీడీపీ మద్దతు ప్రకటించింది. టీడీపీ నేత మాల్యాద్రి రైతుల ఆందోళనలో పాల్గొన్నారు.

మూడు రాజధానులు ఏపీకి ఉంటాయని ప్రకటించి జగన్ రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చును పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని  ఆయన ప్రశ్నించారు.  మూడు రాజధానులు ఏపీకి ఉంటాయని ప్రకటించి జగన్ రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చును పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని  ఆయన ప్రశ్నించారు.  పురుగుల మందు డబ్బాలు పట్టుకొని రైతులు ఆందోళనకు దిగారు. రాజధానిని కొనసాగించాలని  డిమాండ్ చేశారు.