ధాన్యం కొనుగోలుకై అమలాపురం కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా: కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు

ధాన్యం కొనుగోలు  చేయాలని  డిమాండ్  చేస్తూ  అంబేద్కార్ కోనసీమ జిల్లాలోని కలెక్టరేట్  ముందు  రైతులు ఇవాళ ఆందోళన నిర్వహించారు.

Farmers  holds  Conducts  protest  at  Ambedkar  Konaseema Collectorate  office

అమలాపురం:ధాన్యం కొనుగోలు చేయాలని  డిమాండ్  చేస్తూ  అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్  ముందు  శుక్రవారం నాడు రైతులు ధర్నాకు దిగారు.  ధాన్యం కొనుగోలు  చేయాలని కోరితే  తమ టార్గెట్ అయిపోయిందని  చెబుతున్నారని   అధికారుల తీరుపై  రైతులు ఆగ్రహం వ్యక్తం  చేశారు.  ధాన్యం లోడుతో  ఉన్న   ట్రాక్టర్లతో  కలెక్టరేట్  ముందు  ధర్నాకు దిగారు  రైతులు. అంతేకాదు  ధాన్యం కొనుగోలు  చేయకపోతే  తాము ఆత్మహత్య చేసుకుంటామని  రైతులు  హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాలు కూడా పట్టుకుని  కలెక్టరేట్  ముందు  రైతులు  ఆందోళన నిర్వహించారు.  కలెక్టరేట్  ముందు  చుట్టు పక్కల  ధాన్యం  లోడ్ తో  ఉన్న వాహనాలు  నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న  పోలీసులు  కలెక్టరేట్  వద్ద భారీ బందోబస్తు  ఏర్పాటు  చేశారు.రైతుల ఆందోళన  విషయం తెలుసుకున్న  అధికారులు  ధాన్యం కొనుగోలు  చేస్తామని ప్రకటించారు.  సుమారు  10 నుండి  15 టన్నుల  ధాన్యం  కొనుగోలు  చేయాల్సి ఉంటుందని   అధికారులు  చెప్పారు. ఈ ధాన్యం వెంటనే కొనుగోలు  చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో  రైతులు  తమ ఆందోళనను విరమించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios