బాకీ చెల్లించినా బ్యాంక్ అధికారులు పొలం డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని రైతు తన కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే పొలం డాక్యుమెంట్లు మిస్సయ్యాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు
కర్నూలు జిల్లాలో రైతు కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మంత్రాలయం స్టేట్‌బ్యాంక్‌లో నాగేంద్ర అనే రైతు కుటుంబసభ్యులతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. లక్షా 30 వేల రూపాయల నగదు చెల్లించినా బ్యాంక్ అధికారులు పొలం డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే పొలం డాక్యుమెంట్లు మిస్సయ్యాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

