చిత్తూరు: జిల్లాలో విషాదం నెలకొంది. మోటార్ కోసం వెళ్లిన రైతుల్లో ఒకరు వాగులో కొట్టుకుపోయి మరణించారు. శుక్రవారం నాడు ఉదయం రైతు ప్రసాద్ డెడ్‌బాడీని పోలీసులు అధికారులు గుర్తించారు.

జిల్లాలోని ఏర్పేడు మండలంలోని రాళ్లవాగులో ముగ్గురు రైతులు గురువారం నాడు చిక్కుకొన్నారు. అయితే ఈ విషయాన్ని అధికారులకు సమాచారం ఇచ్చారు.  స్థానికులు ఇద్దరు రైతులను సురక్షితంగా వాగు నుండి బయటకు తీసుకొచ్చారు.

అయితే వాగు ఉధృతికి ప్రసాద్ అనే రైతు  వాగులో కొద్దిదూరం కొట్టుకుపోయారు. వాగులో ఉన్న చెట్టుకు ప్రసాద్ మృతదేహాన్ని ఇవాళ అధికారులు గుర్తించారు. వాగులో నీటి ఉధృతి కారణంగా ప్రసాద్ ను కాపాడుకోలేకపోయినట్టుగా చెబుతున్నారు.ప్రసాద్ మృతదేహాన్ని వాగు నుండి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

నివర్ తుఫాన్ కారణంగా చిత్తూరు , నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల ప్రభావం కారణంగా ఈ వాగుకు వరద పోటెత్తింది. ఈ వాగులో చిక్కుకొని ప్రసాద్ మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.