కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో అత్యంత విలువైన వజ్రాలు దొరుకుతున్నాయి. జొన్నగిరి, పగిడిరాయి, జీ ఎర్రగుడి, పెరవలి ప్రాంతంలో ఇవి లభ్యమవుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిన్న జొన్నగిరిలో ఒక రైతుకు విలువైన వజ్రం దొరికింది. పొలంలో పనులు చేస్తున్న ఆ రైతుకు వజ్రం దొరగ్గా.. రహస్యంగా టెండర్ వేశారు. దానిని రూ.కోటి 25 లక్షలకు కొనుగోలు చేశారు గుత్తికి చెందిన వ్యాపారులు. అది బహిరంగ మార్కెట్‌లో రూ. 3కోట్లకు పైగా విలువ చేస్తుందని వ్యాపారులు చెబుతున్నారు.