పూర్తిస్థాయి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ 29 గ్రామాల ప్రజలు నిరసనల బాట పట్టారు. ముఖ్యంగా అమరావతి  కోసం భూములు కోల్పోయిన రైతులు కుటుంబాలతో సహా రోడ్డుమీదకు వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు, మహిళలు రాజధాని పోరులో ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో రైతు కూడా మృత్యువాతపడ్డాడు. 

Also Read ఆందోళనలకు కౌంటర్: వైఎస్ జగన్ తో అమరావతి రైతుల భేటీ...

తాజాగా ఓ రైతు రాజధాని కోసం చేస్తున్న ఆందోళనలో ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ఉదయం తుళ్లూరులో రైతులు చేస్తున్న దీక్షలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి హనుమంతరావు(72) అనే రైతు తుళ్లూరుకు వచ్చారు.  ఆ దీక్షలో పాల్గొంటూనే ఆయన ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కాగా... ఇప్పటి వరకు చాలా మంది  రైతులు దీక్ష లోనే ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా... ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అమరావతిలో పర్యటించనున్నారు.