బాల‌య్య పై రోజా సెటైర్లు విసిరారు. "ఫ్యాన్ గాలి బాగా వీస్తుంది బాల‌య్య‌ విగ్గు ఎగిరిపోతుంద‌ని పారిపోయారు". ఏదో చెస్తాడ‌ని చంద్ర‌బాబు త‌న వియ్యంకుడిని పంపిస్తే ఇంకేదో చేసుకొచ్చాడ‌న్న రోజా.
బాలకృష్ణ పై ఎమ్మెల్యే రోజా జోక్ విసిరారు. "ఫ్యాన్ గాలి బాగా వీస్తుంది బాలయ్య విగ్గు ఎగిరిపోతుందని పారిపోయారు" అని సెటైర్లు విసిరారు రోజా. ఏదో చెస్తాడని చంద్రబాబు తన వియ్యంకుడిని పంపిస్తే ఇంకేదో చేసుకొచ్చాడని ఆమె ఎద్దేవా చేశారు. బాలయ్య ప్రచారంతో టీడీపీ కి లాభం కంటే నష్టమే అధికమని తెల్చేసింది.
బాలకృష్ణపై ఎమ్మెల్యే రోజా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నంద్యాల ప్రచారంలో శుక్రవారం బాలయ్య ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వైసీపి అధ్యక్షుడు జగన్ పై పలు ఆరోపణలు చేశారు, పత్రిపక్ష అధినేత తనకి పేపర్ లేదు, చానేల్ లేదు, అని చెప్పుకుంటున్నారు, మరీ ఉన్న పత్రికలు, చానేల్ ఎవరివో తెలపాలని ప్రశ్నించారు. బాలయ్య వ్యాఖ్యలకు రోజా స్పందించారు.
శనివారం ప్రచారంలో భాగంగా బాలయ్య పై రోజా సెటైర్లు విసిరారు. ఒక్క రోజు బాలయ్య ప్రచారంలో లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయన ఆరోపించారు. నంద్యాల్లో ఫ్యాన్ గాలి అధికంగా వీచడంతో బాలకృష్ణ విగ్గు ఎగిరిపోతుందని అందుకే ఒక్క రోజులోనే పారిపోయారని జోక్ చేశారు. ప్యాన్స్ తమ అభిమాన హీరో దగ్గరకు వస్తే కొట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా చంద్రబాబు పైన కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా చెయ్యలేదని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో బాబు పాలన పోవాలని పిలుపునిచ్చారు. అందుకు నంద్యాల ఉప ఎన్నిక నాంది కావాలని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు.
