జగన్ వీరాభిమాని ప్రాణత్యాగం..ఎందుకో తెలుసా ?

First Published 15, Nov 2017, 10:21 AM IST
Fan of jagan commits suicide in kadapa Dt
Highlights
  • వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిగా చూడలన్నదే తన లక్ష్యంగా చెప్పుకునేవారు. అటువంటి అభిమాని హటాత్తుగా ఆత్మహత్య చేసుకోవటం స్ధానికులను కలచివేసింది. ఇంతకూ ఏం జరిగిందంటే, జగన్‌ సీఎం కావాలి... గ్రామాన్ని, మండలాన్ని అభివృద్ధి చేయాలని అందుకోసం తాను ప్రాణత్యాగం చేసుకుంటున్నట్లు ఓ వ్యక్తి సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కడప జిల్లా రాజుపాళెం మండలం టంగుటూరుకు చెందిన కాచన శ్రీనివాసులరెడ్డి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ శ్రీనివాసులు వివరాల మేరకు సోమవారం టంగుటూరు మెట్ట వద్ద జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే, రాత్రి ఇంటికి చేరుకుని మంగళవారం ఉదయం సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

కొంతకాలంగా శ్రీనివాసులరెడ్డి భార్యపిల్లలకు దూరంగా ఉంటూ ఒంటరి జీవితం గడిపుతున్నాడు. ఇటీవల శ్రీశైలం వెళ్లేందుకు మాల వేసి దేవాలయానికి వెళ్లి పూజలు కూడా చేస్తుండేవాడు. జగన్ అంటే బాగా అభిమానమని అందుకనే మాల వేసుకున్న జగన్ యాత్రలో పాల్గొన్నట్లు స్ధానికులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

 

loader