గుంటూరు: గుంటూరు జిల్లాలో  బిర్యానీ హోటల్ నిర్వాహకుడు శనివారం నాడు మృతి చెందాడు. ఆయనకు కరోనా ఉన్నట్టుగా మృతి చెందిన తర్వాత తేలింది. దీంతో  అధికారులు అప్రమత్తమయ్యారు.

అనారోగ్యంతో  బిర్యానీ హోటల్ నిర్వాహకుడు మృతి చెందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మృతుడి కుటుంబసభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఎవరెవరు మెలిగారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

మృతుడి కుటుంబసభ్యులు, ఆయన బంధువులను ఆదివారం నాడు క్వారంటైన్ కి తరలించారు. మృతుడు ఇంత కాలం పాటు ఎవరెవరిని కలిశారో వారికి కూడ పరీక్షలు నిర్వహించనున్నారు.

also read:కరోనా దెబ్బ: గత నెల మాదిరిగానే ఏపీ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పూర్తి జీతం

ఏపీ రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, కర్నూల్ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.కరోనా  విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం నాడు తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీఎం జగన్ కు ఇవాళ ఫోన్ చేశారు. లాక్ డౌన్ నిబంధనల సడలింపు తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించారు.