చేపల వేటకు వెళ్లిన 12 మంది మత్య్సకారుల ఆచూకీ గల్లంతు: కన్నీరుమున్నీరుతున్న బాధిత కుటుంబాలు
శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు. సముద్రంలో గల్లంతయ్యారా లేదా ఎక్కడైనా చిక్కుకుపోయారో తెలియడం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఈ నెల 16వ తేదీ నుండి వీరి నుండి సమాచారం రాలేదు. దీంతో బాధిత కుటుంబసభ్యులు మంత్రి అప్పలరాజుకి సమాచారం ఇచ్చారు.
శ్రీకాకుళం: చేపల వేటకు వెళ్లిన 12 మంది మత్స్యకారుల ఆచూకీ గల్లంతైంది. ఈ నెల 16వ తేదీ నుండి ఈ 12 మంది ఎవరూ కూడ టచ్‌లో లేరు. దీంతో కుటుంబసభ్యులు ఏపీ మంత్రి అప్పలరాజుకి ఫోన్‌లో సమాచారమిచ్చారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు ఉపాధి కోసం చెన్నైలోని ఫిషింగ్ హర్బర్ నుండి ఈ నెల 7న బోటులో వేటకు వెళ్లారు.ఈ నెల 16వ తేదీ వరకు కుటుంబసభ్యులతో వారంతా టచ్ లో ఉన్నారు. అయితే ఆ తర్వాతి నుండి ఎవరూ కూడ ఫ్యామిలీ మెంబర్స్ తో అందుబాటులో లేరు.
వేటకు వెళ్లిన వారి నుండి సమాచారం లేకపోవడంతో సముద్రంలో గల్లంతయ్యారా, లేదా నెట్ వర్క్ లేని ప్రాంతంలో ఉండిపోయారా అనే ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది. తమ వారి ఆచూకీని తెలుసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు ఏపీ మంత్రి అప్పలరాజుకు ఫోన్ లో సమాచారం ఇచ్చారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన వారంతా శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే. ఉపాధి కోసం వారంతా చెన్నైకి వెళ్లినట్టుగా బాధిత కుటుంబసభ్యులు చెప్పారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్తుంటారు.