సోషల్ మీడియాలో పరిచయమయ్యే వక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులను నమ్మి వారు చెప్పినట్టు చేస్తే చివరికి చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరిలో జరిగిన ఓ ఘటన ఇదే రుజువు చేస్తోంది.
సోషల్ మీడియా మోసాలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా అయిన పరిచయాలకు చివరికి ఇతర సంబంధాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి పరిచయాలతో చాలా మంది మోసపోతున్నారు. కొన్ని సార్లు డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు మరి కొన్ని అనుకోని సంఘటనల్లోనూ ఇరుక్కుంటున్నారు. అలాంటి ఘటనే ఏపీలో గురువారం ఒకటి జరిగింది.
స్నాప్ చాట్ యాప్‌లో చాట్...
ప్రస్తుతం సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకుంటే అది మనకు అలా ఉపయోగపడుతుంది. దానిని మంచి పనుల కోసం ఉపయోగిస్తే మంచికి, చెడుపనుల కోసం ఉపయోగిస్తే చెడుగా ఉపయోపడుతుంది. చాలా మంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి, స్కిల్స్ పెంచుకోవడానికి, వారి అభిరుచిని మెరుగుపర్చుకోవడానికి ఉపయోగిస్తింటే, మరి కొందరు మాత్రం ఇతరులను మోసం చేయడానికి, సులభంగా డబ్బు ఎలా సంపాదించాలన్న విషయాలు తెలుసుకోవడానికి వాడుతున్నారు. ఇలా సోషల్ మీడియాకు రెండు పార్షాలు ఉన్నాయి.
ఏపీలో గురువారం వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవకు చెందినదే. అయితే వారు ఇక్కడ ఉపయోగించుకున్నది స్నాప్ చాట్ యాప్. ఇందులో ఓ యువతికి ఓ యువకుడు స్నాప్ చాట్ ద్వారా పరిచయం అయ్యాడు. వారిద్దరూ అందులో చాట్ చేసుకోవడం మొదలు పెట్టారు. కొంత కాలం తరువాత కాల్స్ కూడా మాట్లాడుకోవడం స్టార్ చేశారు. దీంతో అతడిని పూర్తిగా నమ్మింది ఆ యువతి. అతడు ఎలా చెబితే అలా చేసి చివరికి చిక్కుల్లో పడింది. తాను మోసపోయానని గ్రహించేలోపే ఆ యువకుడు ఆమెను బంధించి కిడ్నాప్ చేశాడు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో ఎట్టకేలకు ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కానీ ఆన్‌లైన్ పరిచయాలను నమ్మకూడదని ఈ ఘటన రుజువు చేస్తోంది.
కాలేజీలో ప్రేమ పాఠాలు.. లెక్చరర్, స్టూడెంట్ జంప్.. ఏపీలో ఘటన
ఇంజనీరింగ్ స్టూడెంట్...
ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఈస్ట్ గోదావరిలోని రాజానగరానికి చెందిన ఓ అమ్మాయి ప్రస్తుతం ఇంజనీరింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు స్నాప్ చాట్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. దీంతో అతడిని నమ్మిన ఆ యువతి ఓ రోజు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే కాలేజ్‌కు అని బస్సులో బయలుదేరిన ఆ యువతి కాలేజ్‌కు వెళ్లకుండా మధ్యలోనే దిగిపోయింది. ఆ యువకుడు వచ్చి ఆమెను బైక్ ఎక్కించుకొని వెళ్లాడు. దీంతో అతడు ఆమెను ఓ లాడ్జ్‌కు తీసుకెళ్లి బంధించాడు. ఆ యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇస్తేనే మీ కూతురును వదిలిపెడతామని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు ఆ యువతి ఫోన్‌ను ట్రాక్ చేశారు. చివరిగా ఎవరితో కాల్ మాట్లాడిందో.. ఎక్కడికి వెళ్లిందో కనిపెట్టారు. ఆ యువతి బస్సు దిగిన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఎవరితో వెళ్లిందో తెలుసుకున్నారు. నిషితంగా కేసును దర్యాప్తు చేస్తూ చివరికి వెస్ట్ గోదావరి జిల్లాలోని భువనగిరిలో ఆ అమ్మాయి ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి ఆ యువతిని రక్షించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమ ఇద్దరికి స్నాప్ చాట్‌లో పరిచయం అయ్యిందని, తాను లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని చెబితే తనతో పాటు ఆ యువతి వచ్చిందని తెలిపాడు ఆ యువకుడు. డబ్బు కోసమే తాను ఈ పని చేశానని చెప్పాడు. పోలీసులు సమయస్పూర్తిగా స్పందించడంతో ఆ యువతిని రక్షించగలిగారు. ఆన్‌లైన్ పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
