ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరిట ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారని.. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలపై విమర్శలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఇంటర్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావును నిందించరాదని జగన్ పేరిట ఎవరో ట్వీట్ చేశారు. కాగా.. ట్వీట్ పట్టుకొని జగన్ ని నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

దీంతో.. ఈ ఘటనపై వైసీపీ నేతలు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది పూర్తిగా తప్పుడు ట్వీట్‌ అని, ఈ ట్వీట్‌ను దురుద్దేశంతో రూపొందించి, ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.