Asianet News TeluguAsianet News Telugu

సినిమా ఫక్కీలో.. సివిల్ సప్లయిస్ ఆఫీసర్నంటూ సోదాలు.. బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడ్డ కీలేడి.  

తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో సివిల్ సప్లయిస్ అధికారిగా, ఫుడ్ ఇన్స్పెక్టర్గా నటిస్తూ.. హోటళ్లు,బేకరీలపై దాడి చేసిన ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ ముఠా కేసుల నమోదు చేస్తామని బెదిరించి.. యాజమానుల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఆ ముఠా వ్యవహారంపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం  ఇవ్వడంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  

fake civil supplies officer arrested in east godavari district
Author
First Published Oct 24, 2022, 7:00 AM IST

తమిళ నటుడు సూర్య, రమ్యకఈష్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గ్యాంగ్.. ఈ సినిమా సూర్య అండ్ కో.. సీబీఐ అధికారులుగా నటించి..  సోదాలు నిర్వహించి డబ్బులు కొట్టేసే సీన్ మీకు గుర్తుందా.. అచ్చు అలాగే.. ఫేక్ ఐడీ కార్డులను తయారు చేసుకుని ఓ ఘరానా లేడీ అండ్ కో సివిల్ సప్లయిస్ అధికారిగా, ఫుడ్ ఇన్స్పెక్టర్గా వ్యవహరిస్తూ హోటళ్లు, బేకరీలపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తామని బెదిరించి డబ్బులు దండుకుంటోంది. వారి వ్యవహరంపై తేడా రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు గుట్టు రట్టయింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. తాడేపల్లిగూడేనికి చెందిన కాళ్ల రమాదేవి చదివింది ఏడో తరగతి అయినా.. ఆమెకు కన్నింగ్ తెలివి తేటలు ఎక్కువే. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ మహిళా చైర్పర్సన్ గా నకిలీ ఐడీ కార్డును క్రియేట్ చేస్తుంది.తన కారు కూడా నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ మహిళా చైర్పర్సన్ స్టికర్ అతికించుకుంది.

గత కొంతకాలంగా తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో సివిల్ సప్లయిస్ అధికారిగా, ఫుడ్ ఇన్స్పెక్టర్గా వ్యవహరిస్తూ హోటళ్లు, బేకరీలపై తన గ్యాంగ్ తో నకిలీ దాడులు చేసేంది. ఈ క్రమంలో కేసులు నమోదు చేస్తామని బెదిరించి.. యాజమానుల నుంచి డబ్బులు వసూలు చేసేంది. ఆమె వ్యవహారంపై అనుమానం రావడంతో కొంతకాలంగా ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఈ క్రమంలో శనివారం దూబచర్లలో ఓ బేకరీలో రమాదేవి అండ్ టీం నకిలీ దాడులు నిర్వహించింది. ఆ బేకరిలో గృహ వినియోగ గ్యాస్ ను వినియోగిస్తున్నారని, ఆ బేకరి యాజమానిని రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే.. ఆ బేకరీ యజమాని  రూ.3 వేలు ఇచ్చాడు. అదే గ్రామంలో శివాలయం  భోజన హోటల్కు వెళ్లి వంటకు వినియోగిస్తున్న రెండు గ్యాస్ సిలిండర్లు సీజ్ చేస్తానని, రూ. 5000 ఇవ్వాలని లేకుంటే కేసు నమోద చేస్తానని బెదిరించింది.

ఈ క్రమంలో ఆ హోటల్ యజమాని రూ.2 వేలు ఇచ్చాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన ఆ గ్రామ వీఆర్ఎ రవి .. నకిలీ రైడింగ్ ముఠా గురించి..తమ సివిల్ సప్లయిస్ డీటీ సుజాతకు సమాచారం అందించారు. ఆమె ఫిర్యాదు మేరకు  రంగంలో దిగిన పోలీసులు. నిందితురాలు రమాదేవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో కీలకంగా కీలకంగా వ్యవహరిస్తున్న ద్వారకా తిరుమలకు చెందిన చెల్లా ఏసు పరారీలో ఉన్నాడు.ఈ క్రమంలో ఆమె నుంచి  ఆమె కారు డ్రైవరును కూడా అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios