పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం- ఉండి రోడ్డులో పేలుళ్లు కలకలం రేపాయి. ఖాళీ స్థలంలో ఆవు మేత మేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుళ్ల ధాటికి ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. రేపు భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం- ఉండి రోడ్డులో పేలుళ్లు కలకలం రేపాయి. ఖాళీ స్థలంలో ఆవు మేత మేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుళ్ల ధాటికి ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. రేపు భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు రెండు కిలోమీటర్ల దూరంలోనే పేలుడు జరిగింది. దీంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

