రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ కు గాయాలయ్యాయి. అనంతపురంలో జన్మభూమి పర్యటన ముగించుకుని కొవ్వూరుకు తిరిగిస్తుండగా హటాత్తుగా కారు ప్రమాదానికి గురైంది. మంత్రి కాన్వాయ్ లోని వాహనాలను ఎదురుగా వేగంగా వచ్చిన ఓ స్విఫ్ట్ డిజైర్ కారు వచ్చి బలంగా ఢీ కొన్నది.  దాంతో ఎస్కార్ట్ వాహనమే కాకుండా మంత్రి కారు కూడా బాగా దెబ్బతిన్నది. మంత్రికి కూడా గాయాలయ్యాయి. అయితే ఏ పాటి గాయాలయ్యాయో స్పష్టంగా తెలీలేదు. సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదు.కాకపోతే ఎదురుగా ా  వచ్చి కాన్వాయ్ ను ఢీ కొన్న కారులోని వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.