ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలో గెలిచిన అర కొర నేతలు కూడా ఎప్పుడు వేరే పార్టీలోకి జంప్ చేద్దామా అని ఆశగా చూస్తున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. లోక్ సభ ఎంపీలు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ భవిష్యత్ కార్యచరణ కోసం కసరత్తులు మొదలుపెట్టారు. ఏ పార్టీలోకి అడుగుపెడితే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే విషయంలో లాభాలు లెక్కేసుకుంటున్నారు. 

అయితే.. ఇప్పటి వరకు టీడీపీ పార్లెమంటరీ నేతలు ఉన్న దాదాపు అందరూ వేరే పార్టీలోకి వెళ్లిపోయినవారేనట. ఒక్క ఎర్రన్నాయుడు మాత్రమే టీడీపీని అంటి పెట్టుకొని ఉన్నారు. 1984 నుంచి 1991 వరకూ టీడీపీపీ నేతగా ఉన్న ఉపేం ద్ర.. కాంగ్రెస్‌, పీఆర్‌పీల్లో చేరారు. 

1991 నుంచి 1996 వరకూ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. అన్నటీడీపీ, బీజేపీ, కాంగ్రె్‌సలలో కొనసాగి.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. 1996-97 మధ్య టీడీపీపీ నేతగా ఉన్న రేణుకా చౌదరి కాంగ్రె్‌సలో చేరి రాజ్యసభ సభ్యురాలయ్యారు.

 ఎర్రన్నాయుడు 1998 నుంచి 2009 వరకూ దాదాపు 11 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. తుదిశ్వాస వరకూ టీడీపీలోనే కొనసాగారు. 2009 నుంచి 2014 వరకూ టీడీపీపీ నేతగా ఉన్న నామా నాగేశ్వరరావు ఇటీవల టీఆర్‌ఎస్ లో చేరి లోక్‌సభాపక్ష నేత అయ్యారు. 2014 నుంచి 19 వరకు టీడీపీపీ నేతగా ఉన్న సుజనా చౌదరి.. నెల క్రితమే రాజ్యసభ పక్ష నేతగా ఎంపికయ్యారు. తాజాగా బీజేపీలో చేరారు.