జగన్ తప్ప.. రాజ్యమంతా కూలింది..!

జగన్ మాత్రమే ఆయన.. పోటీ చేసిన నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన మంత్రి వర్గంలోని ఏ మంత్రి కనీసం ఆధిక్యంలో కనిపించడం లేదు. 

Except peddireddy, Jagan's cabinet collapsed ram

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు.. దేశాన్ని ఆకర్షిస్తున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. నిజంగానే.. ఈ ఎన్నికల ఫలితాలను అందరినీ ఆకర్షించడమే కాదు.. ఆశ్చర్యపోయేలా చేశాయి. ఐదేళ్ల పాలన చేసిన పార్టీని ఇంత ఘోరంగా ప్రజలు ఓటమికి గురి చేస్తారా అనేలా ఫలితాలు వచ్చాయి.  గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ ప్రస్తుతం కనీసం ప్రతి పక్ష పార్టీ హోదా కూడా తగ్గించుకోలేని స్థితికి చేరుకుంది. 

జగన్ మాత్రమే ఆయన.. పోటీ చేసిన నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన మంత్రి వర్గంలోని ఏ మంత్రి కనీసం ఆధిక్యంలో కనిపించడం లేదు. జగన్ కేబినేటిలోని మంత్రులంతా ఘోరంగా ఓడిపోయారు. 

ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగిలిన వారంతా కూటమి నేతల చేతుల్లో ఘోర ఓటమిని చవిచూశారు. మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్ నాథ్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌, అంజాద్‌ బాషా, ఉషశ్రీ చరణ్‌, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజిని, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ, జోగి ర‌మేశ్, వైసీపీ కీలక నేతలు ఓడిపోయారు. కొందరు నేతలు తమ  నియోజకవర్గాలు మార్చినా ప్రయోజనం లేకపోయింది. ఇంత ఘోరమైన ఓటమి చవి చూస్తామని ఆ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు. 

వీళ్లు మాత్రమే... ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఈ సారి ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపారు. యవకులకు టికెట్లు ఇస్తే.. కచ్చితంగా గెలుస్తారని అనుకున్నారు. కానీ వాళ్ల అంచనాలు కూడా తారుమారయ్యారు. వారసులు కూడా కూటమి ప్రవాహంలో కొట్టుకుపోయారు. 

తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కూమరుడు అభినయ్ రెడ్డి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చేతిలో ఓటమి పాలయ్యారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి ఓటమి పాలైయ్యారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి ఓటమి పాలైయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios