దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తెనాలి మాజీ ఎమ్మెల్యే డార్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

రావి మరణవార్త విన్న బంధువులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. రవీంద్రనాథ్ చౌదరి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తెనాలిలోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. బుధవారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.