కృష్ణా జిల్లా దేవరగుంటలో మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, అతని కుమారుడిని కరెంట్ స్తంభానికి కట్టేశారు గ్రామస్తులు. ఓ వ్యక్తి వద్ద 15 లక్షలు అప్పుగా తీసుకున్న మాజీ ఎంపీటీసీ ఆ సొమ్మును తిరిగి చెల్లించలేదు.

ఎన్నిసార్లు అడిగినా అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు గ్రామ పంచాయతీని ఆశ్రయించాడు. దీంతో మాజీ ఎంపీటీసీ అతని కొడుకుని పట్టుకుని కరెంట్ స్తంభానికి కట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రామిసరీ నోటు రాయించి విడిపించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.