తిరిగి రాజకీయాల్లోకి సబ్బం హరి.. త్వరలోనే నిర్ణయం

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 10, Sep 2018, 9:59 AM IST
Ex MP sabbam Hari rejoins in politics
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ, వైసీపీల నుంచి ఆహ్వానాలు వచ్చినప్పటికీ ఆయన వాటిని తిరస్కరించారు.

అయితే తెలుగుదేశం పార్టీపైనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా ఈ మధ్యకాలంలో సబ్బంహరి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వెళతారంటూ ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తాను రాజకీయంగా పున:ప్రవేశంపై త్వరలోనే నిర్ణయాన్ని వెలువరిస్తానని హరి స్పష్టం చేశారు. భవిష్యత్తు రాజకీయ జీవితానికి సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే, విశాఖ నగర పరిధా, గ్రామీణ పరిధా అనేది కొద్దిరోజుల్లోనే వెల్లడిస్తానని హరి పేర్కొన్నారు. 
 

loader