Asianet News TeluguAsianet News Telugu

అన్ని శాఖలకు సజ్జలే మంత్రా... జనాలు, మంత్రులు చితకబాదే రోజు వచ్చింది: హర్షకుమార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (ys jagan) మాజీ ఎంపీ హర్షకుమార్ (harsha kumar) మండిపడ్డారు.  అన్ని శాఖలకు తానే మంత్రి అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) వ్యవహరిస్తున్నారని.. మంత్రులు బయటకొస్తే జనాలు చితకబాదే సమయం ఆసన్నమైందని హర్షకుమార్ జోస్యం చెప్పారు. 

ex mp harsha kumar slams ap cm ys jagan
Author
Amaravati, First Published Nov 26, 2021, 3:05 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (ys jagan) మాజీ ఎంపీ హర్షకుమార్ (harsha kumar) మండిపడ్డారు. శుక్రవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ... పేదలకు ఇస్తున్న పెన్షన్లకు (pensions) కూడా కులాన్ని ఆపాదించే దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్క దళితుడికైనా వైసీపీ (ysrcp) ప్రభుత్వం రుణం ఇచ్చిందా? అని హర్షకుమార్ ప్రశ్నించారు. రాజ్యాంగంలోని హక్కుల అమలు కోసం పోరాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని శాఖలకు తానే మంత్రి అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) వ్యవహరిస్తున్నారని.. మంత్రులు బయటకొస్తే జనాలు చితకబాదే సమయం ఆసన్నమైందని హర్షకుమార్ జోస్యం చెప్పారు. 

మరోవైపు బీజేపీ (bjp) నేత లంకా దినకర్ (lanka dinakar) కూడా జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో వ్యాపారఛాయలే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. కొత్త విధానాలతో దండుకోవడం జగన్ స్టైల్ అని .. నవరత్నాల పేరుతో జనాల నెత్తిన శఠగోపాలు పెడుతున్నారని దినకర్ దుయ్యబట్టారు. గతంలో కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా... కొత్త ఇళ్లు సరిగా కట్టివ్వకుండా.. పేదల నుంచి ఈ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు

Also Read:టిడిపి అధికారంలోకి రాగానే... వారికి ఉచిత రిజిస్ట్రేషన్లు: నారా లోకేష్ హామీ

అంతకుముందు వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా ఇంటిపై సర్వహక్కులు పొందవచ్చంటూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరిట భారీ దోపీడీకి (jagananna sampoorna gruha hakku scheme) జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) ఆరోపించారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ తప్పనిసరి కాదంటూనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని  లబ్దిదారులు వాపోతున్నారని లోకేష్ పేర్కొన్నారు.

ఇదిలావుంటే Andhra pradesh లోని పలు పంచాయితీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు మాయమయ్యాయంటూ ఇటీవల లోకేష్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొన్ని పంచాయితీల ఖాతాల్లో నిధులు తగ్గిపోగా, మరికొన్ని పంచాయితీల ఖాతాల్లో అయితే జీరో బ్యాలెన్స్ చూపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వమే పాలనా అవసరాల కోసం ఈ నిధులను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై లోకేష్ స్పందిస్తూ జగన్ సర్కార్ పై మండిపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios