Asianet News TeluguAsianet News Telugu

రసవత్తరంగా కర్నూలు రాజకీయం: సొంతగూటికి మాజీ ఎమ్మెల్యే

ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇకపోతే నీరజారెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.  

ex mla  nirajareddy joins congress party
Author
Kurnool, First Published Jan 28, 2019, 10:19 PM IST

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉన్న కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కుటుంబ తెలుగుదేశం పార్టీలో చేరడంతో కర్నూలు జిల్లా రాజకీయాలు పొగలు సెగలు కక్కుతోంది. 

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీ వీడుతున్నారనే సమాచారంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బుజ్జగింపులకు దిగింది. పార్టీ వీడొద్దంటూ కోరింది. అయినా పట్టించుకోని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆరు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధానికి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు. 

ఈ పరిణామాల నేపథ్యలో ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో నీరజారెడ్డి సొంతగూటికి చేరుకున్నారు. 

ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇకపోతే నీరజారెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.  

అయితే తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపిస్తూ 2011 జూన్ 17న కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు నీరజారెడ్డి. తన నియోజకవర్గంలో పనులు కావడం లేదని రాజీనామా చేశారు.  నీరజారెడ్డి రాజీనామా వ్యవహారం అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపింది. 

ఆ సమయంలో కర్నూలు ఎంపీగా ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో ఉన్న విబేధాల కారణంగా ఆమె రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. ఆలూరు నియోజకవర్గంలో కోట్ల జోక్యం ఎక్కువగా ఉండటంతో పాటు తనను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. 

ఎమ్మెల్యేగా ఉండి తన కార్యకర్తలకు చిన్న చిన్న పనులు కూడా చెయ్యలేకపోతున్నట్లు ఆమె వాపోయారు. గ్రామస్థాయి అధికారులు కూడా తన మాట వినడం లేదని వాపోయారు. ఆలూరు నియోజకవర్గం సీటును ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన బావమరిది హాలహర్వి కేశవరెడ్డికి ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు.

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు టికెట్ ఖరారు చెయ్యడంతో తనను ఓడించేందుకు కోట్ల కుటుంబం పనిచేసిందని ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. అయితే 2014 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఆలూరు టికెట్ ఆశించారు. అయితే వైసీపీ గుమ్మనూరు జయరాంకు టికెట్ కేటాయించడంతో ఆమె స్తబ్ధుగా ఉండిపోయారు.
 
ఆనాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆలూరు నుంచి మళ్లీ పోటీ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇకపోతే నీరజారెడ్డి భ‌ర్త శేషిరెడ్డి 1989లో ప‌త్తికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

1994లో ఎన్నికల్లో ఎస్వీ సుబ్బారెడ్డి చేతిలో శేషిరెడ్డి పరాజయం పాలయ్యారు. అనంతరం శేషిరెడ్డి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. శేషిరెడ్డి హత్య అనంతరం నీరజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios