వైసీపీకి పెరుగుతున్న బలం.. పార్టీలోకి మరో ముఖ్య నేత

ex MLA muddala sunitha joins YCP today
Highlights

వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే

వైసీపీకి రోజు రోజుకీ బలం పెరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు కీలక నేతలు వైసీపీలో చేరుతున్నారు.  తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే ఈ పార్టీలో చేరారు. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత శుక్రవారం ఉదయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  

నియోజకవర్గంలోని రాజుపాలెంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌​ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతోపాటు  వందలాది మంది ఆమె అనుచరులు పార్టీలో చేరారు. గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు.

loader