రెవెన్యూ సిబ్బందిపై వైసీపీ నేతల దాడి.. పెందుర్తిలో ఆక్రమణల కూల్చివేతపై రాజకీయ దుమారం
విశాఖ జిల్లా (visakhapatnam) పెందుర్తిలో (pendurthi) రెవెన్యూ సిబ్బందిపై దాడి వ్యవహారంలో రాజకీయ వివాదం చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారుల తీరును మాజీ ఎమ్మెల్యే మళ్లా విజయప్రసాద్ (malla vijay prasad) తప్పుబట్టారు. ప్రభుత్వం స్థలం ఎవరూ కబ్జా చేసినా ఉపేక్షించమని ఆయన హెచ్చరించారు.
విశాఖ జిల్లా (visakhapatnam) పెందుర్తిలో (pendurthi) రెవెన్యూ సిబ్బందిపై దాడి వ్యవహారంలో రాజకీయ వివాదం చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారుల తీరును మాజీ ఎమ్మెల్యే మళ్లా విజయప్రసాద్ (malla vijay prasad) తప్పుబట్టారు. ప్రభుత్వం స్థలం ఎవరూ కబ్జా చేసినా ఉపేక్షించమని ఆయన హెచ్చరించారు. పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సందర్భంలో ఇదంతా ఒక ప్రణాళికాబ్ధంగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నంగా మళ్లా విజయప్రసాద్ ఆరోపించారు. కాంపౌండ్ వాల్ కూల్చివేతలో నిబంధనలు పాటించలేదని ఆయన మండిపడ్డారు. బౌండరీని రెవెన్యూ సిబ్బంది నిర్ణయించాకే గోడ కట్టామని విజయప్రసాద్ పేర్కొన్నారు. నిన్నటి ఘటనలో రెవెన్యూ సిబ్బందిపై దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా.. పెందుర్తి మండలం సత్తివానిపాలెం 355 ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన గోడను తొలగించేందుకు గురువారం రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ నేత దొడ్డి కిరణ్.. పెందుర్తి ఆర్ఐ శివ, సచివాలయం వీఆర్వో శంకర్, రెవెన్యూ సిబ్బందిని అసభ్యపదజాలంతో దూషించి దాడి చేశారు. అక్రమ కట్టడాన్ని కూల్చడానికి తెచ్చిన జేసీబీని లాక్కుని.. అంతు చూస్తామంటూ బెదిరించారని రెవెన్యూ సిబ్బంది ఆరోపించారు. ప్రభుత్వ భూములను కాపాడటానికి వెళ్తే తమపై దాడి చేశారని ఆర్‌ఐ శివ కంటతడి పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన కిరణ్‌పై ఆర్డీఓకి ఫిర్యాదు చేసినట్లు ఆర్ఐ తెలిపారు. మరోవైపు ఆర్ఐ, వీఆర్వోపై దాడితో రెవెన్యూ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.