వైసీపీలోకి మాజీ మంత్రి మహిధర్ రెడ్డి

ex-MLA mahidhar reddy joins ycp today
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. రాజకీయ సమీకరణాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ వైపు చూస్తున్న నేత‌ల జాబితా పెరుగుతోంది. చాలా మంది నాయ‌కులు పార్టీలో చేరేందుకు రెడీ అయిపోతున్నారు. కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన వారంతా త‌మ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమ‌వుతున్నారు. 

ఒక‌పక్క పాద‌యాత్రతో జగన్ ప్రజల నుంచి ఆదరాభిమానాలను పెంచుకుంటూ పోతున్నారు.  కొన్ని జిల్లాల్లో పాద‌యాత్రకు విశేష స్పంద‌న ల‌భిస్తున్న నేప‌థ్యంలో సీనియ‌ర్ల చూపు వైసీపీ వైపు ప‌డింది. ఇప్పటికే టీడీపీలో త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్కడం లేద‌ని అసంతృప్తితో ఉన్న నేత‌లు వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉంటు న్నారు. 

ఇదిలా ఉండగా ..తాజాగా ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. మహీధర్ రెడ్డి గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నాయన.. వైసీపీలో చేరి పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చారు.
 

loader