టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. దీంతో... దుగ్గిరాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే... మంగళవారం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి వేడుకులు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు యత్నించడంతో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రాత్రి జరిగిన ఈ ఘటనతో ఏలూరు సమీపంలోని దుగ్గిరాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు, ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో దుగ్గిరాలలో పోలీస్‌ పికెట్ ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని పెదవేగి తహసీల్దార్‌ ఆఫీసుకు పోలీసులు తరలించారు.