గొడవ చేయడానికి రెండు కోతులు కలిశాయి : టీడీపీ - జనసేన పొత్తుపై వెల్లంపల్లి శ్రీనివాస్ హాట్ కామెంట్స్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ . పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్‌లో కూర్చుని షూటింగ్ చేసుకుంటూ ఉంటారని .. లోకేష్ ఎక్కడ ఉన్నాడో తెలియదని ఎద్దేవా చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ . శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఖాళీగా ఉన్నప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లదానికి ప్రయత్నిస్తాడని ఆరోపించారు. ఇప్పుడు గొడవ చేయడానికి రెండు కోతులు కలిశాయంటూ చురకలంటించారు. పవన్ కళ్యాణ్ ఆయన తోత్తులు కెబియన్ దగ్గర రోడ్డు మీద సెల్ఫీ తీసుకుని రోడ్లు ఎలా ఉన్నాయో చెప్పాలని వెల్లంపల్లి సవాల్ విసిరారు. గతంలో ఇవ్వే రోడ్లు గోతులమయంగా ఉండేవని.. వైసిపి ప్రభుత్వంలో విజయవాడలో వేసిన రోడ్లు చూడమని చెప్పాలంటూ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమి చేసారని ఆయన ప్రశ్నించారు. వాళ్ళు చేసిన తప్పులు సీఎం జగన్ సరి చేసుకుంటూ వస్తున్నారని ప్రశంసించారు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాలో పోయిందని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్‌లో కూర్చుని షూటింగ్ చేసుకుంటూ ఉంటారని .. లోకేష్ ఎక్కడ ఉన్నాడో తెలియదని ఎద్దేవా చేశారు. కార్యకర్తలను మాత్రం రోడ్డు మీదకు పంపిస్తారని, పవన్ , లోకేష్‌లు ఏసీలో కూర్చొటారని వెల్లంపల్లి సెటైర్లు వేశారు.
ALso Read: జగన్ రెడ్డీ... ఏం చేసినా ఇప్పుడే... 5 నెలల తర్వాత నువ్వుండవు.. : అచ్చెన్నాయుడు సంచలనం
టిడిపి జనసేన కార్యకర్తలు ఎలా కొట్టుకుంటున్నారు అనేది అందరూ చూశారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిస్తే సరిపోతుందా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. క్రింద కార్యకర్తలు ఎలా విభేదిస్తున్నారు అని పవన్ కళ్యాణ్‌కి అర్ధం కావడం లేదా అని శ్రీనివాస్ నిలదీశారు. గతంలో మోసి మోసి మా భుజాలు అరిగిపోయాయని పవన్ కళ్యాణ్ అన్నారని వెల్లంపల్లి గుర్తుచేశారు. మరి ఈరోజు ఎలా మోస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు . పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుని మోస్తున్నారని అర్ధం చేసుకోవాలని.. పవన్, చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్ధితుల్లో లేరని అన్నారు.