గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి ఆలపాటి రాజా. వైసీపీ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటని మండిపడ్డారు. చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదని విమర్శించారు. 

ప్రభుత్వ తీరు చూస్తుంటే లాభం బెత్తెడు నష్టం బారెడులా ఉందని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ వల్ల ఏదో సాధించేశామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న విషయం తెలియదా అని నిలదీశారు. 

రివర్స్ టెండరింగ్ లో ఆదా కంటే నష్టమే  ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. కనీస అర్హత లేని వాళ్లకు ప్రాజెక్టులు కట్టబెట్టారని మండిపడ్డారు. సొంత వ్యక్తులకు ప్రాజెక్టుల టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. 

"

లిఫ్ట్ ఇరిగేషన్ లు చేసుకునే కాంట్రాక్టర్ లకు పోలవరం పనులు కట్టబెట్టడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 
"రీ" టెండరింగా...?"నీ" టెండరింగా..? గా అనేది జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. 

ప్రధాని నరేంద్రమోదీని ఎందుకు కలిశారో సీఎం జగన్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మోదీతో గంటన్నరపాటు చర్చలు జరిపి కనీసం బ్రీఫింగ్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలని నిలదీశారు. 

బయటకు చెప్పుకోలేని చర్చలు జరిపారా అంటూ ప్రశ్నించారు. వైసిపి అధినేతగా ప్రధాని ని కలిస్తే ఎవరికి అవసరం లేదన్న ఆలపాటి రాజా ఏపి సీఎం హోదాలో జగన్ ను కలిశారని చెప్పుకొచ్చారు.చర్చల సారాంశాన్ని తప్పకుండా జగన్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

సీబీఐ కేసులు కోసమా...? మీ కాంట్రాక్టర్ ల కోసమా ..? దేని కోసం ప్రధాని ని కలిశారో చెప్పాలని తిట్టిపోశారు. కేసిఆర్ వద్ద ఏపి ప్రయోజనాలని జగన్ తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు మాజీమంత్రి ఆలపాటి రాజా.