Asianet News TeluguAsianet News Telugu

శ్రీదేవి దళితురాలే కానప్పుడు అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుంది : మాజీమంత్రి కేఎస్ జవహర్

ఉండవల్లి శ్రీదేవి దళితురాలే కాదని అలాంటప్పుడు అట్రాసిటీ కేసు ఆమెకు ఎలా వర్తిస్తుందని మాజీమంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే దళితురాలే కాదని స్పష్టం చేశారు. ఒక క్రిస్టియన్ అయిండి అట్రాసిటి కేసు ఎలా పెడతారని నిలదీశారు. 
 

ex minister, tdp leader ks jawahar reacts on ysrcp mla undavalli sridevi case issue
Author
Amaravathi, First Published Sep 6, 2019, 4:14 PM IST

గుంటూరు: తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కుల దూషణ వ్యవహారం రోజుకో మలుపులు తిరుగుతోంది. దళిత ఎమ్మెల్యేను దూషించిన వారిని అరెస్ట్ చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీదేవి, మంత్రులు డిమాండ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఆమె దళితురాలే కాదని ఆరోపిస్తోంది. 

ఉండవల్లి శ్రీదేవి దళితురాలే కాదని అలాంటప్పుడు అట్రాసిటీ కేసు ఆమెకు ఎలా వర్తిస్తుందని మాజీమంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే దళితురాలే కాదని స్పష్టం చేశారు. ఒక క్రిస్టియన్ అయిండి అట్రాసిటి కేసు ఎలా పెడతారని నిలదీశారు. 

శ్రీదేవి కులంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయని తెలిపారు. ఎస్సీ కానీ శ్రీదేవిని అనర్హురాలుగా ప్రకటించాలని మాజీమంత్రి కేఎస్ జవహర్ డిమాండ్ చేశారు. అవసరమైతే తాము కూడా పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

ఎమ్మెల్యే శ్రీదేవి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజల కోసం చేసిన చట్టాలను పాలకులు సొంతానికి వాడుకవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. 

బాధితుల కోసం తెచ్చిన అట్రాసిటీ చట్టాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి స్వలాభం కోసం వాడుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. రిజర్వు స్థానాలు ఎస్సీలకే కేటాయించాలని కేఎస్ జవహర్ జగన్ ను నిలదీశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఎమ్మెల్యే శ్రీదేవి క్రిస్టియన్, దళిత మహిళ అంటూ కుల రాజకీయాలా..?: చంద్రబాబు ఫైర్

Follow Us:
Download App:
  • android
  • ios