వైఎస్సార్‌పై పోరాడావా , చిరంజీవికైనా తెలుసా .. కేసీఆర్‌ కోసమే తెలంగాణలో పోటీ : పవన్‌పై పేర్నినాని విమర్శలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని .  కేసీఆర్ ఆదేశాలతోనే తెలంగాణలో 32 స్థానాల్లో జనసేన పోటీకి సిద్ధమైందని పేర్ని నాని ఆరోపించారు . వైఎస్సార్‌పై నువ్వు పోరాటం చేసినట్లు కనీసం చిరంజీవికైనా తెలుసా అని ఆయన నిలదీశారు.  

ex minister perni nani slams janasena chief pawan kalyan ksp

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో పవన్ ఆటవిడుపు యాత్ర చేశారంటూ సెటైర్లు వేశారు. బీజేపీ కంటే , అన్నయ్య కంటే కూడా చంద్రబాబే తనకు ముఖ్యమని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారని నాని దుయ్యబట్టారు. జగన్‌కు దమ్ముంది కాబట్టే ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా గెలిచారని ఆయన తెలిపారు. వైఎస్ఆర్‌ను పవన్ ఎప్పుడు ఎదిరించారని పేర్నినాని ప్రశ్నించారు. వైఎస్సార్‌పై నువ్వు పోరాటం చేసినట్లు కనీసం చిరంజీవికైనా తెలుసా అని ఆయన నిలదీశారు. మా తమ్ముడు వైఎస్‌పై పోరాటం చేశారని చిరంజీవి దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. 

నిన్నూ ఎవరూ ఏమనకూడదు.. నువ్వు మాత్రం అందరినీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావని ఆయన దుయ్యబట్టారు. ఏపీలో ఆధార్ , ఇల్లు, కాపురం వుందా.. ఎన్నిసార్లు పాస్‌పోర్ట్ తీసుకున్నారని పేర్ని నాని సెటైర్లు వేశారు. ఒకసారి ఎన్డీయేలో వున్నానంటావు, మరోసారి ఎన్డీయేలో లేను అంటావు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆదేశాలతోనే తెలంగాణలో 32 స్థానాల్లో జనసేన పోటీకి సిద్ధమైందని పేర్ని నాని ఆరోపించారు. ఏపీలో కాపులు వున్న చోట వారాహి తిరిగినట్లే.. తెలంగాణలోనూ మున్నూరు కాపులు వున్న నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. 

ALso REad: జీ20 సమ్మిట్‌లో మోడీ బిజీ .. టైం చూసి చంద్రబాబు అరెస్ట్, వైసీపీకి సినీ పరిశ్రమ భయపడుతోంది : పవన్

తల్లిని, భార్యను రాజమండ్రి రోడ్లపై వదిలి ఢిల్లీలో ఏం చేస్తున్నారని నారా లోకేష్‌ను ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని.  రోజుకు కోటి, కోటిన్నర తీసుకున్న లాయర్లు బెజవాడలో తిరుగుతున్నారని ఆయన దుయ్యబట్టారు. పాతిక రోజులు ఢిల్లీలో ఏం చేసినట్లు అంటూ నాని నిలదీశారు. ఎవరి కాళ్లు పట్టుకుందామని ఢిల్లీలో తిరుగుతున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. లోకేష్ నాయుడుకు తెలివితేటలు ఎక్కువైపోయాని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మంచి తెలివితేటలు నేర్చుకుని వచ్చారని నాని సెటైర్లు వేశారు. రూ. 3 వేల కోట్లతో స్కామ్ చేశారనే వైసీపీ చెబుతోందని పేర్కొన్నారు. 

రూ.27 కోట్లను సిగ్గు లేకుండా మీ పార్టీ ఖాతాలో వేసుకున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. వీరప్పన్ కూడా ఒక్కసారి దొరికాడని.. దొరికిన తర్వాత చరిత్ర క్లోజ్ అంటూ గుర్తుచేశారు. సీమెన్స్ ఇస్తామన్న డబ్బులు ఎక్కడ అని నాని ప్రశ్నించారు. భారతదేశంలో వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో ఎవరు మొనగాడు అంటే చంద్రబాబు పేరు ఠక్కున చెబుతారని అన్నారు. నా కొడుకు తప్పు చేస్తే ఉరిశిక్ష వేయండి అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని పేర్నినాని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన రోజు నుంచి మీ ఆస్తులు ఎంత అని ఆయన ప్రశ్నించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios