మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు.. కాంగ్రెస్ కి షాకిచ్చారు. శనివారం విజయవాడలో  పసుపులేటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల  మనోహర్ కూడా ఉన్నారు.

గత కొంతకాలంగా.. పసుపులేటి బాలరాజు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. ఇప్పుడు అదే నిజమైంది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో జనసేన బలం పెరుగుతోందని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా.. శుక్రవారం పసుపులేటి తన మద్దతు దారులతో మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ యువకులే.. వారికి రాజకీయ భవిష్యత్ అవసరం.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే భవిష్యత్ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఒక్కటే కనపడుతోంది. మీ అందరూ అంగీకరిస్తే.. జనసేన లో చేరదాం’’ అంటూ పిలుపునివ్వగా.. కార్యకర్తలు అందుకు అంగీకారం తెలిపారు.

వారి అంగీకారంతోనే శనివారం పసుపులేటి జనసేనలో చేరారు. 

సంబంధిత వార్తలు..

కాంగ్రెస్ కి షాక్... నాదెండ్ల బాటలో పసుపులేటి