సాధించిన ఓట్లు.. గెలిచిన సీట్లు చెబితే... రాష్ట్రానికి పెట్టుబడులు రావని ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. డిప్లామెటిక్‌ ఔట్‌ రీచ్‌ సదస్సులో... సీఎం వైఎస్ జగన్‌ ప్రసంగాన్ని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తప్పుబట్టారు. సదస్సులో వనరులు, రాష్ట్రంలో జరిగిన ప్రగతిని వివరించాలని పేర్కొన్నారు.
 
సాధించిన ఓట్లు, వచ్చిన సీట్లు చెబితే పెట్టుబడులు రావని లోకేష్ ఎద్దేవా చేశారు. ఈజ్‌ ఆఫ్‌ డుయింగ్, పాలనలో వచ్చిన 700 అవార్డుల గురించి చెప్పాలన్నారు. గత ప్రభుత్వం సాధించిన ఘనతను చెప్పలేక.. పేద రాష్ట్రం అని జగన్‌ చెబుతున్నారని లోకేష్ విమర్శించారు.

కాగా... శుక్రవారం జరిగిన డిప్లామెటిక్ ఔట్ రిచ్ సదస్సులో జగన్ పలు విషయాల గురించి మాట్లాడారు. ఏపీలో నాలుగు ఓడరేవులు ఉన్నాయని.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆపారమైన అవకాశాలున్నాయన్నారు. తమ రాష్ట్రంలో సుస్ధిరమైన ప్రభుత్వం ఉందని.. మాకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్నారని జగన్ తెలిపారు.

తమది పేద రాష్ట్రమేనని.. హ దరాబాద్ లాంటి నగరం తమకు లేదని.. కాకపోతే బలం ఉందని అన్నారు. పారదర్శక పాలనతో ముందుకెళ్తున్నామని.. టెండర్ల ప్రక్రియ నుంచి కేటాయింపుల దాకా అవినీతిరహిత నిర్ణయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా జగన్ చేసిన ఈ కామెంట్స్ కి లోకేష్ పై విధంగా కౌంటర్ ఇచ్చారు.