Asianet News TeluguAsianet News Telugu

సీఎం గారు... ఇలా చేస్తే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే పని ఉండదు... లోకేష్ సెటైర్లు

ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారు. పేద ప్రజలకు, కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈకేవైసి అంటూ క్యూ లైన్లలో నిలబెట్టారు. ఈమాత్రం దానికి వందరోజుల పండుగ అంటూ సొంత డబ్బా కూడానా! ఎందుకు ప్రజల సొమ్ము దండగ కాకపోతే .. అని ట్వీట్ చేశారు. 

ex minister lokesh responce on  100 days of YS Jagan ruling
Author
Hyderabad, First Published Sep 7, 2019, 1:53 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై  మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్ వంద రోజుల పాలనపై విమర్శలు చేయడంతోపాటు... జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు గురించి కూడా ప్రస్తావించారు. మీ సమస్యకు ఇదే పరిష్కారం అంటూ జగన్ కి ఓ సూచన కూడా చేశారు. జగన్ ని తుగ్లక్ అని పిలుస్తూ ఈ ట్వీట్లు చేయడం గమనార్హం. 

‘‘తుగ్లక్ 2.0  @100డేస్  తుగ్లక్ గారి పాలనలో ధర్నాచౌక్ ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం డల్... అమరావతిని ఎడారి చేసారు, పొలవరాన్ని మంగళవారంగా మార్చారు. 900 హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారు. ఇంతా చేసి ఏమన్నా సాధించారా అంటే అదీ లేదు.’’ అంటూ విమర్శించారు.

మరో ట్వీట్ లో ‘‘ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారు. పేద ప్రజలకు, కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈకేవైసి అంటూ క్యూ లైన్లలో నిలబెట్టారు. ఈమాత్రం దానికి వందరోజుల పండుగ అంటూ సొంత డబ్బా కూడానా! ఎందుకు ప్రజల సొమ్ము దండగ కాకపోతే !! ’’ అని ట్వీట్ చేశారు. 

మరో ట్వీట్ లో... ‘‘తుగ్లక్ 2.0 సమస్యకి పరిష్కారం జగన్ గారూ !  రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, హైదరాబాద్ రావడం ఖర్చుతో కూడుకున్నది అని కోర్టుకి కహానీలు ఎందుకు చెప్పడం, దోచుకున్న లక్ష కోట్లు రాష్ట్ర ఖజానాకి అప్పగిస్తే సరిపోలా !!  రాష్ట్ర  ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, ఖజానా నిండుతుంది. అంతే కాకుండా,  మీరు  ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళ్లి రావడానికి అయ్యే భద్రత, రవాణా ఖర్చులకి, ప్రభుత్వానికి నిధులు కూడా సమకూరుతాయి. ఇంత సులువైన పరిష్కారం ఉండగా మినహాయింపు ఎందుకు మాస్టారు. శిక్ష ఎలాగో తప్పదుగా !’’ అని లోకేష్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios