విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ.  ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం రద్దు చేస్తూ వైయస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆయన హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 2 లక్షల మంది విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే పథకం పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరారు.