తన ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు గుడివాడ వైపీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు, లోకేష్‌లకు దమ్ముంటే గుడివాడ రావాలని కొడాలి నాని సవాల్ విసారు.

తన ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు గుడివాడ వైపీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని స్పష్టం చేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో వున్నానని ఆయన పేర్కొన్నారు. ఐటీడీపీ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని.. చంద్రబాబును రాజకీయాల నుంచి ఇంటికి పంపేవరకు తాను భూమ్మీదే వుంటాని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శునకానందం కోసం కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ దిగజారుడు తనానికి ఇది నిదర్శనమన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు దమ్ముంటే గుడివాడ రావాలని కొడాలి నాని సవాల్ విసారు. తన వెంట్రుక కూడా పీకలేరంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.