Asianet News TeluguAsianet News Telugu

కాపులను అణగదొక్కుతూ... కాపు నేస్తమంటూ ప్రచారమా : జగన్‌పై కళా వెంకట్రావు ఆగ్రహం

వైసీపీ ప్రభుత్వం కాపులను అణగదొక్కుతోందన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు కొందరికి పదవులు ఇచ్చి మిగిలిన వారిని నిర్లక్ష్యం చేసున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

ex minister kala venkata rao fires on ap cm ys jagan over kapu welfare
Author
Srikakulam, First Published Jul 31, 2022, 2:33 PM IST

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ నేత , మాజీ మంత్రి కళా వెంకట్రావు. ఆదివారం చీపురుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాపులను జగన్ ప్రభుత్వం అణగదొక్కుతోందన్నారు. కాపులపై కక్షతో సినీ పరిశ్రమను నాశనం చేశారని కళా వెంకట్రావు ఆరోపించారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు కొందరికి పదవులు ఇచ్చి మిగిలిన వారిని నిర్లక్ష్యం చేసున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్యసభ ఎంపీల లిస్టులో కాపుల్లో ఒక్కరికి కూడా వైసీపీ అవకాశం కల్పించలేదని కళా వెంకట్రావు మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఐదుగురు కాపులను రాజ్యసభకు పంపామని ఆయన గుర్తుచేశారు. కాపులకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తూ.. ‘కాపునేస్తం’ పేరుతో ప్రచారం చేస్తున్నారని కళా వెంకట్రావు మండిపడ్డారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాపులకు న్యాయం చేస్తామని చెప్పే అర్హత జగన్‌కు లేదని వెంకట్రావు మండిపడ్డారు. 

అంతకుముందు శుక్రవారం నాడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని గొల్లప్రోలు Kapu Nestham పథకం కింద నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాపుల ఓట్లను మూటగట్టి చంద్రబాబును గెలిపించేందుకు దత్తపుత్రుడు ప్రయత్నం చేస్తున్నాడని జగన్ ఆరోపించారు. రాజకీయాలు దిగజారి కన్పిస్తున్నాయన్నారు. Kapu  ఓట్లను కొంత మేరకైనా మూటగట్టి వాటిని మరోసారి Chandrababu Naidu కు హోల్ సేల్ గా అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారని Pawan Kalyan పై విమర్శలు చేశారు. దోచుకో, పంచుకో, తినుకో  అనే దత్తపుత్రుడి రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 

Also REad:కాపుల ఓట్లను చంద్రబాబుకు హోల్ సేల్ గా అమ్మే యత్నం: పవన్ కళ్యాణ్ పై జగన్ ఫైర్

ఇకపోతే.. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నసమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రయత్నించలేదని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఈ విషయమై రాష్ట్రంలో  రాజకీయ పార్టీల మధ్య పొత్తుల విషయమై చర్చ సాగింది.  పవన్ కళ్యాణ్ తన ముందు ఉన్న మూడు ఆఫ్షన్లను కూడా వివరించారు. జనసేన ఒంటరిగా పోటీ చేయడం, బీజేపీతో కలిసి పోటీ చేయడం, బీజేపీ,, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం తన ముందున్న ఆఫ్షన్లు అని ఆయన ప్రకటించారు. అయితే  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయమై స్పందించలేదు. కానీ అధికార వైసీపీపై మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios