అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హీరో ఎవరో, విలన్ ఎవరో మే 23న తేలుతుందని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన డొక్కా గవర్నర్‌ నరసింహన్ వద్ద వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. 

రాష్ట్రంలో గొడవలకు వైసీపీ నేతలే కారణమని ఆరోపించారు. గొడవలు సృష్టించింది వారే గవర్నర్ కు ఫిర్యాదు చేసింది కూడా వారేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ఎన్నికల కమిషన్ కి కనిపించడం లేదా అని డొక్కా మాణిక్యవరప్రసాద్ నిలదీశారు. 

కేంద్రం, ఈసీ, జగన్‌ ల మధ్య లోపాయకారి ఒప్పందాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈవీఎలంపై చంద్రబాబు నాయుడు పోరాటం ఆగదన్నారు. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాల్సిందేనని డొక్కా చెప్పుకొచ్చారు.